తాజా తాటి కల్లు పరిమితంగా తాగితే సహజ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లతో శరీరానికి తక్షణ శక్తి లభించి అలసట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ సి, బి, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉండటంతో రోగనిరోధక శక్తి పెరగడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.

మలబద్ధకం, అల్సర్ వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని, కిడ్నీలో రాళ్ల సమస్య నివారణకు కూడా తోడ్పడుతుందని నిపుణుల మాట.

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు డీహైడ్రేషన్ నుంచి రక్షణ కల్పించి, వేసవి తాపం ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.