సదరన్ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా నోటిఫికేషన్ 2026 విడుదల:
సదరన్ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా నోటిఫికేషన్ 2026 విడుదల: 17 ఉద్యోగ ఖాళీలు
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సదరన్ రైల్వే తీపి కబురు అందించింది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 17 ఖాళీల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ (RRC-01/S&G/2026-27) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 18 అక్టోబర్ 2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
- లెవెల్ 2 పోస్టులు: 03 (సదరన్ రైల్వే - 2, ICF - 1)
- లెవెల్ 1 పోస్టులు: 14 (సదరన్ రైల్వే - 12, ICF - 2)
- మొత్తం ఖాళీలు: 17
విద్యార్హతలు:
- లెవెల్ 2 పోస్టులు: కనీసం 50% మార్కులతో 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత లేదా పదో తరగతితో పాటు ITI / నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. (SC/ST/మాజీ సైనికులకు 50% నిబంధన లేదు).
- లెవెల్ 1 పోస్టులు: 10వ తరగతి లేదా ITI లేదా NAC ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్కౌట్స్ అండ్ గైడ్స్ అర్హతలు:
అభ్యర్థులు ప్రెసిడెంట్ స్కౌట్/గైడ్/రోవర్/రేంజర్ లేదా హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ హోల్డర్ అయి ఉండాలి. గత ఐదేళ్లుగా స్కౌట్ సంస్థలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నట్లు ఆక్టివ్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే జాతీయ, రైల్వే లేదా రాష్ట్ర స్థాయిలో ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
వయోపరిమితి (01 జనవరి 2027 నాటికి):
- లెవెల్ 2: 18 నుండి 30 సంవత్సరాలు.
- లెవెల్ 1: 18 నుండి 33 సంవత్సరాలు. (ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం:
మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- రాత పరీక్ష (Written/Hybrid Exam): 60 మార్కులు (40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు + 20 మార్కుల ఎస్సే).
- స్కౌట్స్ & గైడ్స్ సర్టిఫికేట్లు: 40 మార్కులు.
ముఖ్యమైన తేదీలు & దరఖాస్తు రుసుము:
- దరఖాస్తులు ప్రారంభం: 19 సెప్టెంబర్ 2026
- చివరి తేదీ: 18 అక్టోబర్ 2026 (రాత్రి 11:59 వరకు)
- ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ₹500 (పరీక్షకు హాజరైతే ₹400 రీఫండ్ అవుతుంది). ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ₹250 (పూర్తిగా రీఫండ్ అవుతుంది).
అర్హత ఉన్న అభ్యర్థులు సదరన్ రైల్వే అధికారిక వెబ్సైట్ (rrcmas.in) సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
