నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ సముదాయాన్ని అర్హులకు ఇండ్లు కేటాయించి న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు. అర్హుల జాబితా పరిశీలన పేట పదేపదే సర్వేలు చేస్తూ ఎంపికలో జాప్యం చేయడం సరికాదని క్షణమే తమకు ఇండ్లను కేటాయించాలని, లేకుంటే ఆందోళన కొనసాగిస్తామని డిమాండ్ చేశారు.