గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడుమర్స్‌ గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇద్దరు రైతులకు చెందిన తొమ్మిది ఎకరాల చెరకు పంట పూర్తిగా కాలిపోయింది. రాంప్రసాద్‌, యుగంధర్‌ సాగు చేసిన చేతికొచ్చిన పంటతో పాటు డ్రిప్‌ పైపులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.