డిసెంబర్ 22న జిల్లాకు చేరుకోనున్న ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్ర
డిసెంబర్ 22న జిల్లాకు చేరుకోనున్న ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్ర బృందానికి ఘన స్వాగతం పలకాలని, అవసరమైన వసతి, ఆతిథ్య సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. యాత్ర ఆదిలాబాద్ జిల్లా వైపు వెళ్లేందుకు అనువైన రూట్ మ్యాప్ రూపొందించి, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, డీఎంహెచ్వో రాజేందర్, డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, ఎన్సీసీ ప్రతినిధి సంజీవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
