గద్వాల ‌: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. ఫొటోలు, షార్ట్‌ఫిల్మ్‌లను అక్టోబర్‌ 23లోగా, విద్యార్థుల వ్యాసాలను అక్టోబర్‌ 26లోగా సమర్పించాలి. 6వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు పాల్గొనవచ్చు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఈ లింక్‌ ద్వారా నమోదు చేసుకోవాలి: https://forms.gle/YkeKUscWu5LFYWFH7 ఇతర వివరాలకు 8712661828 నంబర్‌లో జిల్లా పోలీస్‌ పీఆర్వోను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.