మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువు పెంచాలంటూ వైసీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక జోక్యం చేసుకోలేమంటూ ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. కొన్ని చోట్ల తమ అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయలేదంటూ వైకాపా నేతలు చెబుతున్నారు.