బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. 🔵 అక్టోబర్ 18 న చిత్తూరు, తిరుపతి, *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు* జిల్లా*ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 🟦 రాయలసీమ, కోస్తాంధ్రలోని వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 🌧️ అక్టోబర్ 19న చిత్తూరు, *నెల్లూరు*, తిరుపతి, ప్రకాశం జిల్లాలకు, అక్టోబర్ 20న గుంటూరు జిల్లాకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అక్టోబర్ 21 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములు.