కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ను సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి అన్నారు. గురువారం తొర్రూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ముద్దసాని సురేష్ ను నియమించి సన్మానించి సూచనలు చేశారు. నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇలాంటి పథకాలను కింది స్థాయి వరకు తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
