చలో దిల్లీ.. ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పిలుపు
ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో భాగంగా నవంబర్ 1న దిల్లీలోని రామ్లీలా మైదాన్ లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశ రాజధానిలో జరిగే ఈ చలో దిల్లీ కార్యక్రమంలో తెలంగాణ గళం, బలం చాటాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వాదులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
