ఢిల్లీకి బయలుదేరిన గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి మరియు కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలో పాల్గొనడానికి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివెల్లడం జరిగింది. అలంపూరు గద్వాల నియోజకవర్గం అన్ని మండలాల మండల అధ్యక్షులు మరియు యూత్ కాంగ్రెస్ సంబంధిత పదాధికారులు నినాదాలు చేస్తూ ఢిల్లీకి బయలుదేరారు మోడీని గద్దె దించే వరకు రాహుల్ గాంధీకి అండగా ఉంటామని తెలిపారు
