మరో వారంలో రెండు అల్పపీడనాలు!
Weather రిపోర్ట్ AP: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఈ నెల చివరి వారంలో
24th, 25th/26th వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. వీటిలో ఒకటి తుఫానుగా మారే ఛాన్సుందని, వచ్చే వారంలో దీనిపై స్పష్టత రావొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. కాగా ఈరోజు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని APSDMA పేర్కొంది.
