చలో ఢిల్లీకి తరలిన నిర్మల్ కాంగ్రెస్ నేతలు
చలో ఢిల్లీకి తరలిన కాంగ్రెస్ నేతలు...
జెండా ఊపి బస్సు ప్రారంభించిన నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీహరి రావు......
ఓటు బచావో.. దేశ్ బచావో నినాదంతో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం తరలివెళ్లారు. నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు గారి నేతృత్వంలో ప్రత్యేక వాహనంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరానున్నట్లు తెలిపారు. ఓటు చోరీ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తామని పేర్కొన్నారు.
