పటేల్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ కలెక్టరేట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. దేశంలోని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతకు బాటలు వేసిన ఉక్కుమనిషి పటేల్ జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై, ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవరావుతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
